భారతదేశం, మార్చి 17 -- తెలంగాణ శాసనసభ ముందుకు సోమవారం మూడు కీలక బిల్లులు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం రాత్రి విడుదల చేసిన ఎజెండా ప్రకారం.. ఎస్సీల వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు.. బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదిస్తారు. మంత్రి కొండా సురేఖ మరో బిల్లును ప్రవేశపెడతారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థల బిల్లుకు ఆమె సవరణలు ప్రతిపాదించనున్నారు.

బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించిన తర్వాత.. దేశవ్యాప్తంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానాన్...