భారతదేశం, మార్చి 15 -- మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి.. మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ ఉత్సవాల కోసం రూ.2 కోట్లు కేటాయించిందని.. అప్పట్లో మీ పార్టీ ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాకా మీరేం చేశారని ప్రశ్నించారు.

'2014 నుంచి 2023 వరకు ఒక్కసారి కూడా కాకతీయ ఉత్సవాలను నిర్వహించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది. అనుభవం కలిగిన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్యాలు మాట్లాడకుండా.. రాష్ట్రాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా' అని శ్...