భారతదేశం, మార్చి 15 -- కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలి.. ఆయన ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. తాము అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలే తప్పు చేశారని బీఅర్ఎస్ నేతలు అంటున్నారు.. ప్రజలను తప్పు పట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. మీ స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పైన లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ మారమార్చురీలో ఉందని మాట్లాడానన్న రేవంత్.. కేసీఆర్‌ను అనేంత కుంచిత బుద్ది తనకు లేదని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై కేసీఆర్‌తో ఎపుడైనా చర్చకు సిద్ధమని చెప్పారు.

'తెలంగాణలో మహిళలు నన్ను ఇంటిబిడ్డగా చూసుకున్నారు. ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. 5000 స్కూల్స్‌ను బీఆర్ఎస్ మూసివేసిం...