తెలంగాణ,హైదరాబాద్, మార్చి 26 -- ఆన్ లైన్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ, ఆన్ లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్ గేమ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన ఆయన. కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు.

"ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉంది. వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.గతంలో బెట్టింగ్ వ్...