తెలంగాణ,హైదరాబాద్, మార్చి 26 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఇవాళ సభలో మాట్లాడిన కేటీఆర్. కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు. పనులు కావాలంటే 30 శాతం కమీషన్లు అడుగుతున్నారనే ప్రచారం జరుగుతోందని. ఇదే విషయాన్ని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పారని వ్యాఖ్యానించారు. 20 శాతం కమీషన్లు అంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్న విషయాన్ని సభలో గుర్తు చేశారు. ఇదే సమయంలో ఓటుకు నోటు, పీసీసీ అధ్యక్ష పదవి కోనుగోలు చేశారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది.

30 శాతం కమీషన్లు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విలువలు లేని రాజకీయాలు చేయడం లేదని. సభలో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఫైర్ అయ్యా...