తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 7 -- ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కేబినెట్ విస్తరణపై కసరత్తు కొనసాగుతోందని చెప్పారు. ఇప్పట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనంటూ సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే విషయంలో తాను ఎవరిని రికమండ్‌ చేయడం లేదన్నారు.

ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అత్యవసరంగా అరెస్ట్‌ చేయించి జైల్లో వేయాలనే యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.

పీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గాన్ని ప్రకట...