భారతదేశం, మార్చి 6 -- Sivasri Skandaprasad: బీజేపీ నేత, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య, గాయని శివశ్రీ స్కందప్రసాద్ ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన రాజకీయ సహచరుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆ పెళ్లి ఫోటోలలో బీజీపీ నాయకులు అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవీయ తదితరులు కూడా ఉన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రి వి.సోమన్న కూడా ఎంపీ తేజస్వీ సూర్య, గాయని శివశ్రీ స్కందప్రసాద్ ల వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు.

శివశ్రీ స్కందప్రసాద్ కర్ణాటక సంగీతం, భరతనాట్యం, విజువల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం కలిగిన బహుముఖ...