భారతదేశం, ఏప్రిల్ 18 -- Teja Sajja Mirai: హ‌నుమాన్ త‌ర్వాత మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజా స‌జ్జా. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

మిరాయ్ అనౌన్స్‌మెంట్ వీడియో గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్‌ను గురువారం రివీల్ చేశారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ఈ 18న మిరాయ్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ గ్లింప్స్‌లో పోరాట‌యోధుడిగా తేజా స‌జ్జా క‌నిపిస్తోన్నాడు. మిరాయ్ మూవీకి కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మిస్తున్నాడు.

చారిత్ర‌క అంశాల‌తో ఈ గ్లింప్స్ ఆస‌క్తిక‌రంగా మారింది. అన‌గ‌న‌గా ఓ సామ్రాట్‌...సామ్రాట్ అశోక్‌...చ‌రిత్ర‌లో మ‌ర‌క‌గా మిగిలిన అత‌డి క‌ళింగ‌యుద్ధం అనే డైలాగ్‌తో ఆస‌క్...