తెలంగాణ,హైదరాబాద్, మార్చి 2 -- తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్.. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు చుట్టు గట్టిగా చర్చ నడుస్తోంది. జాతీయ పార్టీలోనే ఉండటమే కాదు అదే పార్టీ గుర్తుపై ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. కట్ చేస్తే కొంతకాలంగా బీసీ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ, పక్క పార్టీ అనే తేడా లేకుండా. సీరియస్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. తీన్మార్ మల్లన్న వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలను ఇచ్చింది.

తీన్మార్ మల్లన్న గతంలో జర్నలిస్ట్ గా పని చేసేవారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత. కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఆ వెంటనే వచ్చిన మహబూబ్ నగర్ - రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో...