భారతదేశం, ఫిబ్రవరి 7 -- తెలంగాణ కాంగ్రెస్‌లో.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాంగ్రెస్‌గా మారాయి.

'బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారు.. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కాంగ్రెస్ క్లియర్‌గా ఉంది. కానీ.. సర్కార్ క్లియర్‌గా లేదు. నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారు. బీసీలను అణచివేయాలని చూస్తున్నారు. షో...