భారతదేశం, మార్చి 1 -- ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తీన్మార్‌ మల్లన్నపై కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో వేటు వేసింది. పార్టీ పంపిన షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో.. మల్లన్నను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

మల్లన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై స్పందించిన పార్టీ.. లైన్ దాటి మాట్లాడారంటూ గతనెల ...