తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 6 -- తెలంగాణ కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన విషయంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన వివరాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

కుల గణనపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులకు స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కుల గణనను చేపట్టింది. ఇందుకు సంబంధించి వివరాలను ఇటీవలే విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహించింది. అయితే ఈ నివేదికలో పేర్కొన్న వివరాలపై ఎమ్మెల్సీ తీన్మార్ ...