భారతదేశం, జనవరి 29 -- Teenage love: ఇంటర్‌ చదువుతున్న బాలిక ప్రేమ వ్యవహారం విషాదంతంగా మారింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో స్నేహితుడిని ఇంటికి పిలిచింది. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి తండ్రి రావడం.. ఇంట్లో సన్నిహితంగా ఉన్న వారిని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కుమార్తెతో సన్నిహితంగా ఉన్న బాలుడిని కొట్టి అతని గొంతు కోశాడు. దీంతో ఆందోళనకు గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

హనుమకొండలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘటనలో ఓ బాలిక ప్రాణాలు బలితీసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నేహితుడిని ఇంటికి పిలిచింది. అదే సమయంలో ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తండ్రి బాలుడిని చూసి ఆగ్రహానికి గురయ్యాడు. అతనిపై దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఇది చూసి ఆందోళనకు గురైన బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

హనుమకొండ నగర శివారు ప్రాంతానికి చెందిన బాలిక ఇంటర్ సెకండియర్‌ చదువు త...