భారతదేశం, జనవరి 18 -- Tech companies layoff in 2024 : 'ఎఫీషియెన్సీ' పేరుతో పెద్ద పెద్ద టెక్​ సంస్థలు.. లేఆఫ్​లపై మళ్లీ ఫోకస్​ చేస్తున్నాయి! 2024 మొదటి నెల కొన్ని రోజుల్లోనే.. ప్రపంచవ్యాప్తంగా 7,500కిపైగా మంది ఉద్యోగాలు కోల్పోవడం ఆందోళనకరమైన వార్త. అంతేకాకుండా.. గూగుల్​, అమెజాన్​ వంటి సంస్థలు.. ఏడాది పొడవునా ఉద్యోగాలను కట్​ చేస్తూ ఉంటామని చెబుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ వ్యవస్థను పెంచి, అనవసరమైన సెక్టార్స్​లో ఉద్యోగాలను కట్​ చేయాలని బడా సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2024లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కానీ.. ఈ ఏడాది జరిగే లేఆఫ్​లు.. టార్గెటెడ్​గా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్​ పేరెంట్​ కంపెనీ ఆల్ఫాబెట్​ ఇప్పటికే వేలాది మందిని ఇళ్లకు పంపించేసింది. అతిపెద్ద ప...