భారతదేశం, ఏప్రిల్ 17 -- Teacher Movie: '#90s: ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఏడాది జనవరిలో ఈటీవీ విన్‍లో వచ్చిన ఆ సిరీస్ భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ఆ సిరీస్‍తో దర్శకుడు ఆదిత్య హాసన్ చాలా ఫేమస్ అయ్యారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. నితిన్‍తో ఓ మూవీ కోసం తాను అడ్వాన్స్ కూడా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్ చెప్పారు. అయితే, ఆ మూవీ కంటే ముందు ఆదిత్య హాసన్ వేరే సినిమా చేస్తున్నారు. హీరోయిన్ స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతోనే సినిమాల్లో అడుగుపెడుతున్నారు.

కలర్స్ స్వాతి - డైరెక్టర్ ఆదిత్య హాసన్ సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. శ్రీరామనవమి సందర్భంగా నేడు (ఏప్రిల్ 17) ఈ సినిమా టైటిల్‍ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ చిత్రానికి 'టీచర్' అనే పేరును ఖరారు చ...