Hyderabad, ఏప్రిల్ 7 -- పీరియడ్స్ అనేవి అందరి ఆడవాళ్లు ప్రతినెల ఎదుర్కునే సమస్యే. ఈ సమయంలో కడుపులో నొప్పి, అలసట, నీరసం, వాంతులు, మైకం వంటి వన్నీ సహజమైన లక్షణాలే. అయితే ఈ సమస్యలు అందిరికీ సాధారణ స్థాయిలోనే ఉండకపోవచ్చు. కొందరికి పీరియడ్స్ వచ్చాక మూడు రోజు నరకంలా అనిపిస్తుంది. తీవ్రమైన కడపు నొప్పి, బాడీ పెయిన్స్, తలనొప్పి, వికారం వంటివి అధిక మొత్తంలో ఇబ్బంది పెడుతుంటాయి. కొందరు బాధ తట్టుకోలేక ఏడుస్తుంటారు. పడుకునే ఉంటారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం ప్రతి నెల పెయిన్ రిలీఫ్ మెడిసిన్ ను వాడుతుంటారు.

ఈ మందులు పీరియడ్ క్రాంప్స్ నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయేమో. కానీ దీర్ఘకాలికంగా ఇవి హార్మోన్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పీరియడ్ నొప్పులను సహ...