భారతదేశం, ఫిబ్రవరి 15 -- సత్యవర్ధన్‌ అనే యువకుడి కిడ్నాప్, హత్యాయత్నం కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో 12మందిని చేర్చారు. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని కేసులో చేర్చే అవకాశం ఉంది. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులు కీలకంగా ఉన్నారు.

ఈ కేసులో వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీతో పాటు నిమ్మా లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో వల్లభనేని వంశీని జిల్లా జైలుకు తరలించారు. అయితే.. వంశీ అరెస్టు వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా.. టీడీపీ సీనియర్ నేత బుద్ధా ...