భారతదేశం, మార్చి 25 -- రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే లేని లిక్కర్‌ స్కామ్‌ను తెరమీదకు తెచ్చారని.. వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'చంద్రబాబు డైరెక్షన్‌లో లోక్‌సభలో శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్దాలను అందంగా వల్లించాడు. నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు.. రాష్ట్రంలో లిక్కర్‌ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుంటే ఆ విషయం తెలియలేదా. ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తరువాతే.. లిక్కర్‌స్కామ్ గురించి తెలిసిందా. లేని ఈ స్కామ్‌లో వేలకోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్లిపోయారంటూ తప్పుడు ఆరోపణలు...