భారతదేశం, మార్చి 29 -- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల కిందట ప్రకటించారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇవాళ 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తయ్యింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించిన అధిష్టానం.. కొలికపూడిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తిరువూరు పార్టీ వ్యవహారాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసింది. కేశినేని చిన్ని, నెట్టెం రఘురామ్‌, మంతెనతో కమిటీ ఏర్పాటైంది. పార్టీకే అల్టిమేటం ఇవ్వడంపై కమిటీ ఆరా తీస్తోంది. ఈ కమిటీ పార్టీ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనుంది.

ఇటీవల ఓ ఆడియో...