భారతదేశం, ఫిబ్రవరి 25 -- TDP Office Attack Case : టీడీపీ కార్యాల‌యం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత‌లు దేవినేని అవినాష్‌, జోగి ర‌మేష్‌, లేళ్లఅప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాం, గ‌వాస్కర్‌ల‌తో స‌హా 24 మందికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. ష‌ర‌తుల‌తో కూడిన ముంద‌స్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. 2024 సెప్టెంబ‌ర్ 4న దేవినేని అవినాష్‌, జోగి ర‌మేష్‌తో పాటు వైసీపీ నేత‌లంద‌రికీ రాష్ట్ర హైకోర్టు ముంద‌స్తు బెయిల్‌ను నిరాక‌రించింది. దీంతో వైసీపీ నేత‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష‌న్‌ను మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ సుధాన్షు దులియా, జ‌స్టిస్ కె.వినోద్ చంద్రన్ కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచారించింది.

వైసీపీ నేత‌ల‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని ష‌ర‌తుల‌ను విధించింది. ద‌ర్యాప్తున‌కు పూర్త...