భారతదేశం, జనవరి 3 -- దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని.. టీడీపీ స్పష్టం చేసింది. కార్యకర్తల సంక్షేమానికి ఎప్పుడూ పెద్దపీట వేస్తున్నామని తెలిపింది. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక.. కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో.. 2024 అక్టోబర్ 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది డిసెంబర్ 31తో ముగియాల్సి ఉంది. కానీ.. మరో 15 రోజులు పొడిగించారు.

ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు కోటి మంది వరకు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుందని నేతలు చెబుతున్నారు. ఈ మేరకు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు లోకేష్.. యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్...