భారతదేశం, జనవరి 31 -- తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమాన్ని.. ఈసారి రాయలసీమలో నిర్వహించనున్నారు. 2025 మహానాడును ఈసారి కడపలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో మహానాడు జరిగే అవకాశం ఉంది. జగన్ సొంత జిల్లాల్లో మహానాడును నిర్వహించాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహన్ని కొనసాగిస్తూ.. 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడును నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకొన్న తొలి మహానాడు ఇదే. అప్పట్లో వైభవంగా మహానాడును నిర్వహించారు.

మహానాడు అనే పదం.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి విషయాల...