భారతదేశం, ఫిబ్రవరి 18 -- TCS in FORTUNE list: 2025కి గాను ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ కంపెనీల జాబితాలో భారతీయ టెక్ దిగ్గజం టీసీఎస్‌ స్థానం సంపాదించింది. టెక్నాలజీ రంగంలో టీసీఎస్ సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని టీసీఎస్ పొందింది. సేవల్లో వినూత్నత, క్లయింట్ల అవసరాలపై దృష్టి, ఉద్యోగులకు ప్రాధాన్యత.. వంటి పద్ధతులతో నిబద్ధతతో, వేగంగా మారిపోతున్న టెక్నాలజీ వ్యాపార రంగంలో అగ్రగామిగా టీసీఎస్ కొనసాగుతోంది.

''ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయ కంపెనీల'కు (World's Most Admired Companies) సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో ఐటీ సేవలు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్‌లో అంతర్జాతీయ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చోటు దక్కించుకుంది. క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణలు, ఉద్యోగులకు ప్రాధాన్యమిచ్చే సంస్కృతిని ప...