Hyderabad, మార్చి 24 -- టీబీ వ్యాధిని తెలుగులో క్షయ అని పిలుస్తారు. ఈ క్షయ వ్యాధి వస్తే మనిషి రూపురేఖలే మారిపోతాయి. పాతికేళ్ళ అందమైన యువతి కూడా సన్నగా, పీలగా మారి అందవిహీనంగా తయారవుతుంది. క్షయ వ్యాధి బాధితులు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. టీబీ అనేది ఊపిరితిత్తులకు సోకే సమస్య. ఇది మన శరీరంలో ఏ అవయవానికైనా వచ్చే అవకాశం ఉంది. కేవలం జుట్టు, గోర్లు తప్ప ఇతర అవయవాలకు క్షయ బ్యాక్టీరియా సోకే అవకాశం ఎక్కువ. ఇది అంటువ్యాధి కూడా. కాబట్టి క్షయ వ్యాధి ఉన్నవారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

టీబీ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. అందుకే ఇంట్లో ఎవరికైనా టీబీ వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి ఒక గదిని కేటాయించి వారి వస్తువులను ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడ...