భారతదేశం, మార్చి 21 -- Tax Collections: కరీంనగర్‌లో రెండు మునిసిపాలిటీలు రికార్డు స్థాయిలో 100శాతం పన్ను వసూళ్లు చేశాయి. గడువు కంటే ముందే పన్నులు వసూలు చేయడంలో హుజురాబాద్‌, జమ్మికుంట రికార్డు సృష్టించాయి.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇక పది రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తి వసూలుకు మున్సిపల్ అధికారులు పడరాని పాట్లుపడుతున్నారు. పెండింగ్ లో ఉన్న ఆస్తిపన్ను వసూలుకు రెడ్ నోటీసులు జారీ చేసి మున్సిపల్ సేవలను నిలిపి వేస్తున్నారు. సెలవు దినాల్లో సైతం పని చేసి పన్ను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

అలాంటి చర్యలకు అవకాశం లేకుండా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట రెండు మునిసిపాలిటీలు 100% ఆస్తిపన్ను వసూలుచేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. తెలంగాణలో 143 మున్సిపాలిటీ లు ఉండగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ...