భారతదేశం, ఏప్రిల్ 12 -- Tatkal ticket booking timings: తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని భారతీయ రైల్వే ప్రకటించింది. ఏసీ, నాన్ ఏసీ టికెట్ సెగ్మెంట్లలోని కేటగిరీలకు బుకింగ్ టైమింగ్స్ మార్చినట్లు వచ్చిన వార్తలను, పోస్టులను ఐఆర్సీటీసీ ఖండించింది.

''తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లకు వేర్వేరు టైమింగ్స్ గురించి ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏసీ, నాన్ ఏసీ క్లాసులకు సంబంధించి తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదు'' అని ఐఆర్సీటీసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రావెల్ ఏజెంట్ల బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ రైల్వే తెలిపింది. ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాల్లో కూడా ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

అధికార...