భారతదేశం, ఫిబ్రవరి 11 -- టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ షేర్లు నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ షేర్లలో నిరంతరంగా పతనం కనిపిస్తూనే ఉంది. మంగళవారం కూడా ఈ షేర్ 3 శాతనికిపైగా పడిపోయింది. రూ.130.20కి చేరింది. గత ఐదు రోజుల్లో 3 శాతానికి పైగా, ఈ ఏడాది లెక్కన చూసుకుంటే.. 5 శాతం వరకు పతనం నమోదైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.62 లక్షల కోట్లకు పడిపోయింది. టాటా గ్రూప్ షేర్ ఈ ఏడాది జనవరి 13న తన 52-వారాల అత్యల్ప స్థాయి రూ.122.60 దగ్గర వ్యాపారం చేసింది.

స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అందుబాటులో ఉన్న ట్రేడింగ్ డేటా ప్రకారం, మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే టాటా స్టీల్ కంపెనీ స్టాక్ రూ. 133.00 వద్ద ప్రారంభమైంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అమెరికాలో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శా...