భారతదేశం, మార్చి 24 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్​కు సన్నద్ధమవుతోంది. అయితే ఈ మోడల్​ ప్రస్తుతం రోడ్​ టెస్ట్​ దశలో ఉంది. ఈ మోడల్​ కామోఫ్లోజ్​లో ఇటీవలే కనిపించింది. ఈ ప్రోటోటైప్​తో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు..

టాటా సియెర్రా ఈవీ- ఐసీఈ వెర్షన్​తో అందుబాటులోకి రానుంది. టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల కంటే ముందు ఈ సియెర్రా ఈవీ మొదట భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ స్వదేశీ కార్ల తయారీ సంస్థ నుంచి ఫ్లాగ్​షిప్ ఈవీ అవుతుంది.

టాటా సియెర్రా ఈవీ టెస్ట్ మ్యూల్ భారీగా కప్పబడి ఉన్నట్టు స్పై షాట్లు వెల్లడించాయి. ఫలితంగా డిజైన్ ఎలిమెంట్స్ చాలా వరకు దాగి ఉన్నాయి. అయితే, కొన్ని స్టైలింగ్ ఎలిమెంట్స్ కామోఫ్లేజ్డ్ ర్యాప్ ద్వారా కనిపించాయి. సియెర్రా ఈవీలో నిటారుగా ఉండే ఫ్రెంట్ ఫ్యాసి...