భారతదేశం, ఏప్రిల్ 29 -- Tata Punch EV on road price Hyderabad : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో.. ఎస్​యూవీల దండయాత్ర కొనసాగుతోంది. ఇక టాటా పంచ్​తో బంపర్​ హిట్​ కొట్టింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​. టాటా పంచ్​ పెట్రోల్​ మోడల్​ ఒక్కటే కాదు.. సీఎన్​జీ, ఈవీ మోడల్స్​ని కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మూడూ కూడా సేల్స్​ పరంగా దూసుకెళుతున్నాయి. ఇలా.. పెట్రోల్​, సీఎన్​జీ, ఎలక్ట్రిక్​ వర్షెన్​లు ఉన్న ఏకైక టాటా మోటార్స్​ కారు.. ఈ టాటా పంచ్​. అంతేకాదు.. గత కొన్ని నెలలుగా.. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ వెహికిల్స్​లో నెంబర్​ 1 స్థానంలో ఉంది ఈ ఎస్​యూవీ. ఈ నేపథ్యంలో.. చాలా మంది కస్టమర్లు.. పంచ్​ కొనాలని చూస్తున్నారు. కానీ.. మూడు ఆప్షన్స్​ ఉండేసరికి.. ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే. టాటా పం...