భారతదేశం, ఫిబ్రవరి 18 -- Tata Nexon EV: టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ అమ్మకాలను సైలెంట్ గా నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు, టాటా నెక్సాన్ ఈవీ బ్రాండ్ మీడియం రేంజ్, 45 వెర్షన్ లను మాత్రమే భారత మార్కెట్లో విక్రయించనుంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఇతర మార్పులు ఏవీ లేవు. నెక్సాన్ ఈవీ ఎంఆర్ ప్రారంభ ధర రూ.12.49 లక్షలు కాగా, నెక్సాన్ ఈవీ 45 ప్రారంభ ధర రూ.13.99 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. అయితే, టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ ఎల్ఆర్, ఎంఆర్ వేరియంట్లను నిలిపివేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అలా కాదని, ఎంఆర్ వేరియంట్ ను కొనసాగించాలని టాటా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన నెక్సాన్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని టాటా మోటార్స్ పేర్కొంది. పనోరమిక్ సన్ రూఫ్, అధునాతన వ...