భారతదేశం, ఫిబ్రవరి 14 -- Tata Nexon 5 star safety rating: క్రాష్ టెస్ట్ లో నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 5 స్టార్ రేటింగ్ ను సాధించినట్లు గ్లోబల్ ఎన్సీఏపీ (Global NCAP) ఇటీవల ప్రకటించింది. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్ యూవీ పెద్దల సేఫ్టీకి సంబంధించి 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు, బాలల రక్షణలో 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు సాధించింది. 2018 లో కూడా గ్లోబల్ ఎన్సీఏపీ (Global NCAP) క్రాష్ టెస్ట్ లో టాటా నెక్సాన్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించిన మొదటి భారతీయ కారు గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

టాటా నెక్సాన్ (Tata Nexon) లో బాడీషెల్ ఇంటిగ్రిటీ, ఫుట్ వెల్ ప్రాంతం సురక్షితంగా ఉన్నాయని గ్లోబల్ ఎన్సీఏపీ నివేదించింది. ''నెక్సాన్ లో సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ డోర్లు కూడా ఉన్నాయి. డ్రైవర్, ప్రయాణికుడి తల, మెడకు కల్పించిన రక్షణ బాగుంది. డ్రైవర్, ప్రయ...