భారతదేశం, డిసెంబర్ 6 -- Tata Motors price hike : దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​.. వాహనాల ధరలను మరోమారు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 జనవరిలో వాహనాల ధరలను పెంచాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2023 ఏప్రిల్​ నుంచి ఎమిషన్స్​కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటికి తగ్గట్టుగా.. సంస్థకు చెందిన వాహనాలను సిద్ధం చేసేందుకు ఈసారి ధరలను పెంచాలని టాటా మోటార్స్​ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏడాది కాలంగా ముడి సరకు ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాజా ధరల పెంపుతో కంపెనీపై భారం తగ్గుతుందని టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్​, ఎలక్ట్రిక్​ వెహికిల్​ ఎండీ శైలేష్​ చంద్ర తెలిపారు.

"రెగ్యూలేటరీ మార్పులు.. ధరలను ప్రభావితం చేస్తాయి. ముడి సరకు ధరలు తగ్గితే, అది వచ్చే త్రైమాసికంలో కనిపిస్తాయి. కానీ ఏడాదిగా ముడి సరకు ధరలు ఎక్కువగానే ఉన...