భారతదేశం, ఫిబ్రవరి 2 -- దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​కి గత కొంతకాలంగా గడ్డుకాలం నడుస్తోంది! సంస్థ సేల్స్​ కొన్ని నెలలుగా తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా, జనవరి 2025లోనూ టాటా మోటార్స్​ వాహన అమ్మకాలు పడిపోయాయి. ఇది టాటా మోటార్స్​ స్టాక్​పైనా భారీ ప్రభావాన్నే చూపిస్తోంది. మరి ఇప్పుడు స్టాక్​ పరిస్థితేంటి?

టాటా మోటార్స్ 2025 జనవరిలో మొత్తం 80,304 యూనిట్లను విక్రయించింది. జనవరి 2024లో ఇది 86,125 యూనిట్లుగా ఉండేది. గత నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 78,159 యూనిట్లకు పడిపోయాయని టాటా మోటార్స్ ఫిబ్రవరి 1, 2025 న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో విక్రయించిన 84,276 దేశీయ యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం తక్కువ!

టాటా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు.. 2024 జనవరిలో 54,033 యూనిట్ల నుంచి 11 శాతం తగ్గి, 2025 జనవరిలో 48,316...