భారతదేశం, ఫిబ్రవరి 4 -- దివంగత వ్యాపారవేత్త రతన్​ టాటా ప్రియ మిత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంతను నాయుడు తాజాగా ఒక ప్రకటన చేశారు. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​లో ఆయన.. స్ట్రాటజిస్ట్​ ఇనీషియేటివ్స్ విభాగానికి హెడ్​,​ జనరల్​ మేనేజర్​గా నియమితులైనట్టు తెలిపారు.

'టాటా మోటార్స్​లో జనరల్ మేనేజర్, హెడ్ - స్ట్రాటజిక్ ఇనీషియేటివ్​గా కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటు వేసుకుని ఇంటికి నడిచి వచ్చేవారు. ఆయన కోసం కిటికీ దగ్గర నిలబడి ఎదురుచూసేవాడినని నాకు గుర్తు. ఇప్పుడు లైఫ్​ ఫుల్​ సర్కిల్​లోకి వచ్చింది," అని లింక్డ్ఇన్​లో శంతను నాయుడు పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....