భారతదేశం, మార్చి 11 -- టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి, కంపెనీ అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందులో ఒకటి హారియర్ ఈవీ. విడుదలకు ముందు కంపెనీ ఇటీవల తన పూణే ప్లాంట్లో హారియర్ ఈవీని ప్రదర్శించింది. అక్కడ ఈ ఎస్‌యూవీ కొన్ని విన్యాసాలు కూడా చేసింది. మీడియా నివేదికల ప్రకారం, హారియర్ ఈవీ రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ కావచ్చు. హారియర్ ఈవీ డిజైన్, ఫీచర్లు, డ్రైవింగ్ రేంజ్ గురించి తెలుసుకుందాం.

డిజైన్ విషయానికొస్తే.. హారియర్ ఈవీ మల్టీ లింక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. మల్టీ-లింక్ సస్పెన్షన్‌తో ఈవీ ఆఫ్-రోడ్ ట్రాక్ లను మెరుగ్గా నిర్వహించగలదు. ఈవీలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. లోయర్ బంపర్‌పై ఉన్న వర్టికల్ స్లాట్స్ అత్యంత ఆకర్షణీయమైన అప్...