భారతదేశం, ఫిబ్రవరి 14 -- Tata Curvv record: టాటా మోటార్స్ కు చెందిన కూపే పెట్రోల్ ఎస్ యూవీ టాటా కర్వ్ ఎయిర్ ఇండియా బోయింగ్ 737విమానాన్ని 100 మీటర్ల దూరం లాగి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 'లో స్థానం సంపాదించింది. 48 టన్నుల బరువున్న బోయింగ్ 737 విమానాన్ని 100 మీటర్ల దూరం లాగడం ద్వారా టాటా కర్వ్ ఈ రికార్డును నెలకొల్పింది. టాటా మోటార్స్ ఈ విజయాన్ని వివిధ సోషల్ మీడియా ఛానెళ్లలో వెల్లడించింది.

టాటా కర్వ్ అట్లాస్ ఆర్కిటెక్చర్, హైపరియన్ జీడీఐ పవర్ట్రెయిన్ దృఢత్వాన్ని ప్రదర్శించేందుకు తిరువనంతపురంలోని ఏఐఈఎస్ఎల్ హ్యాంగర్ లో ఈ ఫీట్ చేసి, రికార్డును నెలకొల్పారు. ఈ కారులో 1.2-లీటర్ ఇంజన్ ఉంది. ఇది 5,000 ఆర్పిఎమ్ వద్ద 123.2 బీహెచ్పీ, 1,750 నుండి 3,000 ఆర్పిఎమ్ వద్ద 225 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వాహనంతో ఈ...