భారతదేశం, మార్చి 6 -- టాటా గ్రూప్ తన ఆర్థిక విభాగం టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.17,500 కోట్లు) సేకరించనుంది. టాటా క్యాపిటల్ భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలలో ఒకటి. 900 కంటే ఎక్కువ శాఖలతో ఉంది. స్టాక్ మార్కెట్ పతనం ఉన్నప్పటికీ అనేక కంపెనీలు ఐపీఓలకు సిద్ధమవుతున్నాయి. టాటా క్యాపిటల్ కూడా అందులో ఒకటి.

కంపెనీ మార్కెట్ విలువ 11 బిలియన్ల డాలర్లు(సుమారు రూ. 96,000 కోట్లు)గా లెక్కగట్టింది. ఈ ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17,500 కోట్లు) సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా క్యాపిటల్ డైరెక్టర్ల బోర్డు గత వారం 23 కోట్ల షేర్ల లిస్టింగ్‌కు ఆమోదం తెలిపింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరికొన్ని జారీ చేయనుంది.

ఇటీవలి రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర క్షీణతను చవిచూశాయి. అత్యల్ప స్థాయికి చ...