భారతదేశం, ఫిబ్రవరి 3 -- Tanuku SI Audio Viral : పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ఎస్సై సత్యనారాయణ మూర్తి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు మూర్తి తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఇద్దరు తోటి ఉద్యోగులు కారణంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.

తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 31వ తేదీ ఉదయం ఎస్ఐ సత్యనారాయణమూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ మూర్తి ఓ కేసు విషయంలో ఆరోపణలను ఎదుర్కొని, సస్పెన్షన్‌కు గురయ్యారు. వీఆర్‌లో ఉన్న ఎస్ఐ మూర్తి సీఎం చంద్రబాబు పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చారు. పీఎస్ బాత్రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

తేతలిలో గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఎస్సై మూర్తిని సస్పెండ్ చేశారు. ఆత్...