Hyderabad, ఏప్రిల్ 7 -- ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే కూరగాయల్లో బ్రోకలీ ముందు వరుసలో ఉంటుంది. విటమిన్లు, ఖినజాలతో పాటు ఫైబర్. యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉండే బ్రోకలీ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా బాగా సహాయపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో బ్రోకలీ అద్భుతంగా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మం, కళ్లు, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న బ్రోకలీని ఏదో ఒక విధంగా రోజూవారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు దీన్ని తప్పకుండా తినిపించాలి.మీరు కూడా మీ ఇంట్లో వారికీ, పిల్లలకు నచ్చేలా బ్రోకలీతో ఏదైనా టేస్టీ వంటకాన్ని చేసి పెట్టాలనుకుంటే తందూరీ బ్రోకలీ మీకు మంచి ఆప్షన్. పిల్...