భారతదేశం, ఫిబ్రవరి 7 -- Tamil OTT: మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల త‌మిళ మూవీ మ‌ద్రాస్‌కార‌ణ్ ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం (నేటి) నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కిన మ‌ద్రాస్‌కార‌ణ్ మూవీలో షేన్ నిగ‌మ్, క‌లైయరాస‌న్‌, ఐశ్వ‌ర్య ద‌త్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న మ‌ద్రాస్‌కార‌ణ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు రొటీన్ స్క్రీన్‌ప్లే కార‌ణంగా ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కోటి లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద...