భారతదేశం, ఫిబ్రవరి 13 -- నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ త‌మిళ మూవీ టూ లెట్ ఓటీటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.2019లో రిలీజైన ఈ మూవీ డిజిట‌ల్‌ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న‌ది.

చాలా రోజుల పాటు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. రైట్స్ గ‌డువు ముగియ‌డంతో అమెజాన్ ప్రైమ్ నుంచి తొల‌గించారు. తిరిగి మ‌ళ్లీ అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో టూలెట్‌ మూవీ రిలీజైంది.

65వ నేష‌న‌ల్ అవార్డ్స్‌లో బెస్ట్ త‌మిళ మూవీగా టూలెట్ అవార్డును అందుకున్న‌ది. ఇఫీతో పాటు ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ కావ‌డ‌మే కాకుండా అనేక‌ అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది. టూలెట్ మూవీలో సంతోష్ శ్రీరామ్‌, శీలా రాజ్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

చెలియాన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర...