భారతదేశం, మార్చి 26 -- Tamil OTT: త‌మిళ సినిమాలు రాక‌ధ‌న్‌, యోశి బుధ‌వారం ఓటీటీలోకి వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. యోశి మూవీ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌గా... రాక‌ధ‌న్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క‌థాంశంతో తెర‌కెక్కింది. . ఈ రెండు సినిమాలు 2023లో థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చాయి. 99 రూపాయ‌ల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన రాక‌ధ‌న్ మూవీలో వంశీకృష్ణ‌, రియాజ్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దినేష్ క‌లైసెల్వ‌న్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో సంజ‌నా సింగ్ హీరోయిన్‌గా న‌టించింది.

అర్జున్ అనే యువ‌కుడు దారుణంగా హ‌త్య‌కు గురువుతాడు. ఈ కేసును అజ్మ‌ల్ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఇన్వేస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడ...