Hyderabad, మార్చి 4 -- Tamannah Break Up: సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటల వరకూ వెళ్లకుండానే విడిపోయింది. తమన్నా, విజయ్ వర్మ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు మనీకంట్రోల్ రిపోర్ట్ వెల్లడించింది. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్ లో ఉన్న ఈ ఇద్దరూ విడిపోయినట్లు ఆ జంట సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.

తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసినా.. తర్వాత తాము ప్రేమలో ఉన్నట్లు పబ్లిగ్గా వెల్లడించి ఆశ్చర్యపరిచారు. వీళ్ల పెళ్లి కూడా త్వరలోనే జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

ఇద్దరూ విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతారని కూడా ఆ రిపోర్టు చెప్పింది. "కొన్ని వారాల కిందటే తమన్నా, విజయ్ వర్మ విడిపోయార...