Hyderabad, మార్చి 7 -- Tamannaah Breakup: తమన్నా, విజయ్ వర్మ విడిపోయారా? రెండేళ్ల ప్రేమకు గుడ్ బై చెప్పి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారా? ఈ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకూ నోరు మెదపకపోయినా.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్షిప్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ల్యూక్ కౌటినో పాడ్‌కాస్ట్ లో ఆమె మాట్లాడింది.

తమన్నా తన బ్రేకప్ రూమర్ల మధ్య అసలు ప్రేమ, రిలేషన్‌షిప్ మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రేమ అనేది బేషరతుగా ఉంటుందని, అదే రిలేషన్‌షిప్ ఒకరకంగా ఓ బిజినెస్ ట్రాన్జాక్షన్ లాంటిదని ఆమె అనడం గమనార్హం.

"ప్రేమ అంటే ఏంటి, రిలేషన్‌షిప్ అంటే ఏంటి అనేదాని మధ్య చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. షరతులు వచ్చి చేరే క్షణం ప్రేమ అనేది ఇక ఉండదు. ప్రేమ ఎప్పుడూ బేషరతుగా ఉండేదే. అది వన్ సైడెడ్ కూడా కావచ్చు. ప్రేమ అనేది లోపల ఉండేది.

అవతల...