Hyderabad, ఏప్రిల్ 16 -- Tamanna About Sharwanand In Odela 2 Pre Release Event: దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటి తమన్నా చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన సినిమా ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ ఓదెల 2 సినిమాకు దర్శకత్వం వహించారు.

రీసెంట్‌గా హైదరబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో ఓదెల 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా యంగ్ హీరో శర్వానంద్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా భాటియా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా ఏప్రిల్ 17న పాన్ ఇండియాగా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా వెళ్...