Hyderabad, ఏప్రిల్ 18 -- Director Sampath Nandi About Tamanna Odela 2 Success: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటించి లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఓదెల 2 చిత్రంలో తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా నిన్న విడుదలైన ఓదెల 2 అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ఏప్రిల్ 17న ఓదెల 2 సక్సెస్ మీట్ నిర్వహించారు.

సక్సెస్ ప్రెస్ మీట్‌లో మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. "మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన...