భారతదేశం, ఏప్రిల్ 2 -- Talliki Vandanam : ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.

ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ప్రాజెక్టులు తరిమేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకువస్తున్నారన్నారు. ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.

జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారని మంత్రి డోలా మండిపడ...