భారతదేశం, ఫిబ్రవరి 28 -- Talliki Vandanam: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థపై దృష్టి సారించకపోవడం, తప్పుడు విధానాలతో రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని బడ్జెట్‌ ప్రసంగంలో పయ్యావుల ప్రకటించారు.

పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఏ కారణం చేతనూ ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో, మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం క్రింద 15,000 రూపాయల ఆర్థిక సహాయంను అందించనున్నట్టు తెలిపారు. చదువుకునే ప్రతి విద్యా...