భారతదేశం, మార్చి 2 -- Tailoring Centers To Women : ఏపీ మహిళలను ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కుట్టు మిషన్లతో పాటు, టైలరింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలను నిర్వహించనున్నారు. టైలరింగ్ లో శిక్షణతో పాటు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. బీసీ వెల్ఫేర్ నుంచి 46,044 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.

Published by HT Digital Co...