భారతదేశం, ఏప్రిల్ 10 -- Tahawwur Rana: 2008 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడైన తహవూర్ హుస్సేన్ రాణాను ఏప్రిల్ 10న అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువచ్చారు. రాణా దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిరస్కరించడంతో, భారత విచారణను తప్పించుకునే చివరి అవకాశం కూడా తప్పిపోయింది. దాంతో, గురువారం ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చారు.

2008 ముంబై దాడుల్లో ప్రధాన కుట్రదారుల్లో తహవూర్ హుస్సేన్ రాణా, డేవిడ్ కోల్ మన్ హెడ్లీ ముఖ్యమైనవారు. డేవిడ్ కోల్ మన్ హెడ్లీ కి 64 ఏళ్ల తహవుర్ రాణా అత్యంత సన్నిహితుడు. తహవూర్ రాణా సహకారంతో ఆ సమయంలో భారత్ లో ఉగ్రదాడుల లక్ష్యాలపై రెక్కీ నిర్వహించడానికి హెడ్లీకి సులభమైంది. అమెరికాలోని తహవుర్ రాణాకు చెందిన ఇమ్మిగ్రేషన్ సంస్థ హెడ్లీ భారత ప్రయాణాలను సులభతరం చేసింది. ఈ సంస్థ హెడ్లీ గూఢచర్యం మిషన్లకు ఫ...